వెంకయ్యనాయుడు గారు ఆ పని చేస్తే ప్రత్యేక హోదా వస్తుంది.. హీరో కూడా అవుతారు: నటుడు శివాజీ
- ఏపీకి అన్యాయం జరుగుతోంది
- ఈ వ్యవహారంలో వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలదే కీలక పాత్ర
- వెంకయ్యనాయుడు కనుక రాజీనామా చేస్తే ప్రత్యేకహోదా వస్తుంది
‘ఏపీకి ప్రత్యేకహోదా ఎవరు తీసుకువస్తారు, ఎవరు హీరోలవుతారనే విషయాలను పక్కనపెడితే .. వెంకయ్యనాయుడు గారు ఒక్కడు కనుక తన పదవికి రాజీనామా చేస్తే ఈ రోజున ప్రత్యేకహోదా వస్తుంది. ఆయన హీరో కూడా అవుతారు. ఈ విషయం ఆయనకు ఎవరైనా చెప్పినా బాగానే ఉంటుంది. లేదా, రాష్ట్ర ప్రజలకు హెల్ప్ చేసిన వాడిని అవుతానని ఆయన రియలైజ్ అయితే బాగుంటుంది. దేశ వ్యాప్తంగా భారీ చర్చ జరుగుతుంది’ అని శివాజీ అన్నారు.