Venkaiah Naidu: వెంకయ్యనాయుడు గారు ఆ పని చేస్తే ప్రత్యేక హోదా వస్తుంది.. హీరో కూడా అవుతారు: నటుడు శివాజీ

  • ఏపీకి అన్యాయం జరుగుతోంది
  • ఈ వ్యవహారంలో వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలదే కీలక పాత్ర
  • వెంకయ్యనాయుడు కనుక రాజీనామా చేస్తే  ప్రత్యేకహోదా వస్తుంది
కేంద్ర మంత్రి వర్గం నుంచి టీడీపీ మంత్రులు బయటకు రావడం సంతోషకరమని ప్రముఖ నటుడు శివాజీ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై ఆరోపణలు గుప్పించారు. ‘ఏపీకి జరుగుతున్న అన్యాయం వ్యవహారంలో వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలదే కీలక పాత్ర అని ఆయన ఆరోపించారు.

‘ఏపీకి ప్రత్యేకహోదా ఎవరు తీసుకువస్తారు, ఎవరు హీరోలవుతారనే విషయాలను పక్కనపెడితే .. వెంకయ్యనాయుడు గారు ఒక్కడు కనుక తన పదవికి రాజీనామా చేస్తే ఈ రోజున ప్రత్యేకహోదా వస్తుంది. ఆయన హీరో కూడా అవుతారు. ఈ విషయం ఆయనకు ఎవరైనా చెప్పినా బాగానే ఉంటుంది. లేదా, రాష్ట్ర ప్రజలకు హెల్ప్ చేసిన వాడిని అవుతానని ఆయన రియలైజ్ అయితే బాగుంటుంది. దేశ వ్యాప్తంగా భారీ చర్చ జరుగుతుంది’ అని శివాజీ అన్నారు.
Venkaiah Naidu
actor shivaji

More Telugu News