rajanikanth: ఇకపై రజనీ ట్విట్టర్ ఖాతా ‘@రజనీకాంత్’

షార్ట్స్‌లో చూడండి
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన ట్విట్టర్ ఖాతాలో కీలక మార్పు చేశారు. తన ట్విట్టర్ ఖాతా నుంచి ‘సూపర్ స్టార్’ అనే బిరుదును ఆయన తొలగించారు. లక్షలాది అభిమానులకు ఆరాధ్యదైవంగా ఉన్న రజనీకాంత్ ఆ బిరుదును తొలగించడం చాలా వెలితిగా ఉందని సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఎంతో నిరాడంబరంగా ఉండే రజనీ, తన బిరుదును ట్విట్టర్ ఖాతా నుంచి తొలగించారు. దీంతో ‘@సూపర్ స్టార్ రజనీకాంత్’ కాస్తా ‘@రజనీకాంత్’గా ఆయన ట్విట్టర్ ఖాతా మారింది. కాగా, 2013లో రజనీకాంత్ తన ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు. 
Go Back to Shorts
rajanikanth
twitter

More Telugu News