kcr: గజ్వేల్ లో సీఎం కేసీఆర్ మినీ క్యాంపు కార్యాలయం ప్రారంభం

షార్ట్స్‌లో చూడండి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సీఎం కేసీఆర్ మినీ క్యాంపు కార్యాలయం ఈరోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, గజ్వేల్ అభివృద్ధి సంస్థ అధికారి హనుమంతరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

కాగా, ఈ మినీ క్యాంపు కార్యాలయాన్ని కోటి రూపాయలతో నిర్మించినట్టు సమాచారం. కింది అంతస్తులో ఎమ్మెల్యే కార్యాలయం, చాంబర్, మీటింగ్ హాల్, పీఏ, విజటర్స్ కు వేర్వేరు గదులు ఉన్నాయి. కింది అంతస్తులో రెండు బెడ్రూమ్ లు, డ్రాయింగ్ రూమ్, పూజ గది, హాలు, వంట గది ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. 
Go Back to Shorts
kcr
gajwale

More Telugu News