Congress: 'హోదా' కోసం పార్లమెంటు ముట్టడికి యత్నం.. ఢిల్లీలో ఏపీసీసీ నాయకుల అరెస్టు

  • విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్
  • అరెస్టయిన వారిలో ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ, ప్రధాన కార్యదర్శి నరహరిశెట్టి  
  • ఆంధ్ర ప్రజల ఆవేదనను మోదీ సర్కారు పట్టించుకోవడం లేదని ఆగ్రహం
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్రత్యేక హోదాను ప్రకటించడంతో పాటు విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఏపీ నేతలు ఢిల్లీలో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. నిన్న ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చింది.

ఇందులో భాగంగా పార్లమెంటు లోపలికి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించిన నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ, ప్రధాన కార్యదర్శి నరహరిశెట్టి నరసింహారావుతో పాటు ఆకుల శ్రీనివాసకుమార్, రాజీవ్ రతన్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు. ఆంధ్ర ప్రజల ఆవేదనను మోదీ సర్కారు పట్టించుకోవడం లేదని అన్నారు.
Congress
BJP
parliament
Special Category Status

More Telugu News