nitish kumar: మోదీకి మరో తలనొప్పి.. మాకూ ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ మరో మిత్రపక్షం డిమాండ్

  • బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నితీష్ కుమార్ డిమాండ్
  • గతంలో పలుమార్లు ఇదే డిమాండ్ చేసిన నితీష్
  • షాకైన బీజేపీ కీలక నేతలు
విభజన హామీలను నెరవేర్చాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీతో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకుంటున్న తరుణంలోనే ప్రధాని మోదీకి మరో తలనొప్పి మొదలైంది. బీహార్ కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ డిమాండ్ చేశారు. మరో మిత్రపక్ష నేత నుంచి ఇలాంటి డిమాండ్ రావడంతో బీజేపీ కీలక నేతలు షాకయ్యారు. గతంలో కూడా ప్రత్యేక హోదా కోసం నితీష్ పలుమార్లు డిమాండ్ చేశారు. ఓవైపు, పార్టీలకు అతీతంగా ఏపీ ఎంపీలంతా ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు ఉద్ధృతం చేసిన తరుణంలో... నితీష్ మరోమారు ప్రత్యేక హోదా పల్లవి అందుకోవడం చర్చనీయాంశంగా మారింది. 
nitish kumar
bihar
Special Category Status

More Telugu News