vijay devarakonda: విజయ్ దేవరకొండతో ఎలాంటి గొడవలూ లేవు: 'ఏ మంత్రం వేశావే' దర్శకుడు

  • విజయ్ దేవరకొండ హీరోగా 'ఏ మంత్రం వేశావే'
  • తరిగిపోతోన్న మానవ సంబంధాల నేపథ్యంలో కథ 
  • రేపే ప్రేక్షకుల ముందుకు
విజయ్ దేవరకొండ హీరోగా శ్రీధర్ మర్రి 'ఏ మంత్రం వేశావే' సినిమాను రూపొందించాడు. శివాని సింగ్ కథానాయికగా నటించిన ఈ సినిమా, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి శ్రీధర్ మర్రి మాట్లాడారు. " నేను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసేవాడిని. సినిమాల పట్ల గల ప్రేమతో ఉద్యోగం వదిలేసి వచ్చాను" అన్నారు.

"కొత్త దర్శకులను నమ్మే నిర్మాతలు తక్కువ గనుక, నేను దాచుకున్న డబ్బుతోనే ఈ సినిమా చేశాను. తరిగిపోతోన్న మానవ సంబంధాల నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కి విజయ్ దేవరకొండ రాకపోవడంతో, మా ఇద్దరి మధ్య ఏవో గొడవలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. నిజానికి మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఆయన వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వలన రాలేకపోతున్నాడంతే" అంటూ చెప్పుకొచ్చారు. 
vijay devarakonda
shivani singh

More Telugu News