hareesh rao: దేశ రాజకీయాల్లో మార్పుకోసమే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు: హరీష్ రావు

  • పోలీసు శాఖలో 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నాం
  • మహిళలకు అన్ని రంగాల్లో సహకారమందిస్తున్నాం
  • కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్ర తుస్సు యాత్రగా మారింది
దేశరాజకీయాల్లో మార్పు కోసమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మహిళలకు అన్ని రంగాల్లో సహకారం అందిస్తున్నామని అన్నారు. పోలీసు శాఖలో 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేసిన ఘనత తమదేనని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న బస్సు యాత్ర తుస్సు యాత్రగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. గత కాంగ్రెస్ హయాంలో మాఫియా రాజ్యమేలిందని ఆయన పేర్కొన్నారు. 
hareesh rao
Telangana
comments on congress

More Telugu News