janasena: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ కోసం ముస్తాబవుతున్న మంగళగిరి

  • ఆచార్య నాగార్జునా యూనివర్సిటీ ఎదురుగా జనసేన సభ
  • ఈ నెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ
  • చురుగ్గా సాగుతున్న పనులు
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ కోసం మంగళగిరి ముస్తాబవుతోంది. ఈ నెల 14న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా వున్న విశాల ప్రదేశంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు జోరందుకున్నాయి. సభా వేదిక, ప్రాంగణాన్ని జనసేన శ్రేణులు చదును చేయిస్తున్నాయి. బారికేడ్ల నిర్మాణం పనులు మొదలుపెట్టారు. పలు విభాగాలుగా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను ఆ పార్టీకి చెందిన నేతల పర్యవేక్షణలో కార్యకర్తలు పూర్తి చేస్తున్నారు. 
janasena
Guntur District
mangalagiri

More Telugu News