manik sarkar: సీపీఎం కార్యాలయంలో నివాసానికి దిగిన త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్!

  • సొంతిల్లు లేకపోవడంతో పార్టీ కార్యాలయంలో ఆశ్రయం 
  • భార్య పేరిట ప్లాట్ ఉన్నప్పటికీ దానిపై వివాదం
  • పార్టీ కార్యాలయంలో కనీస వసతులు ఉంటాయన్న సీపీఎం నేత  
సుదీర్ఘకాలం పాటు త్రిపుర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఏలిన మాణిక్ సర్కార్ అధికారం కోల్పోవడంతో తలదాచుకునేందుకు భార్యతో కలసి పార్టీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. అగర్తలలో ఉన్న సీపీఎం కార్యాలయంలో రెండు గదుల ఫ్లాట్ లో భార్య పంచాలి భట్టాచార్జ్ తో కలసి బస చేశారు. మాణిక్ సర్కార్ కు ఓ సొంత ఇల్లు కూడా లేదన్న విషయం తెలిసిందే.

 సీఎంగా ఉన్నంత కాలం ఆయన ప్రభుత్వ అధికారిక భవనంలో నివసించారు. ‘‘పార్టీ కార్యాలయంలో కనీస వసతులు ఉంటాయి. ఇది అసాధారణమేమీ కాదు. మా నేతల్లో ఎక్కువ మంది నిరాడంబర జీవితాన్ని గడిపేవారే’’ అని త్రిపుర సీపీఎం కార్యదర్శి బిజన్ ధార్ అన్నారు. మాణిక్ సర్కార్ సతీమణి పంచాలి భట్టాచార్జ్ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. ఆమెకు అగర్తలలో ప్లాట్ ఉంది. అందులో ఇల్లు కట్టించాలంటూ బిల్డర్ కు అప్పగించగా వివాదంలో చిక్కుకుంది. దీంతో ఆ దంపతులకు పార్టీ కార్యాలయమే దిక్కయింది.
manik sarkar
tripura

More Telugu News