Narendra Modi: నరేంద్ర మోదీని మనిషిగా మారుద్దాం పదండి: దర్శకుడు కొరటాల శివ సంచలన ట్వీట్

  • డైరెక్టుగా ప్రధానినిన టార్గెట్ చేసుకున్న కొరటాల
  • ఇచ్చిన హామీలను గుర్తుచేద్దాం పదండి
  • వైరల్ అవుతున్న పోస్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రం వైఖరిని దర్శకుడు కొరటాల శివ తూర్పారబట్టాడు. తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఓ పోస్టును పెడుతూ డైరెక్టుగా ప్రధానిని టార్గెట్ చేసుకున్నాడు.

 "ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి గతంలో ఇచ్చిన హామీలను మనమంతా కలిసి ప్రధాని నరేంద్ర మోదీకి గుర్తుచేసి, ఆయన్ను మనిషిగా మారుద్దాం. తెలుగు రాష్ట్రాలు భారత్‌లో అంతర్భాగం అని మీరు నిజాయతీగా భావిస్తున్నారా సార్?" అని ప్రశ్నించారు. కాగా, రెండు రోజుల క్రితం తన కొత్త చిత్రం ‘భరత్ అనే నేను’ టీజర్‌ లో పాప్యులర్ అయిన ఓ డైలాగ్‌ ను కొరాటాల శివ తన సోషల్ మీడియాలో మోదీకి అన్వయించడం గమనార్హం. కొరటాల చేసిన పోస్ట్‌ ఇప్పుడు వైరల్ అవుతోంది. సరైన సమయంలో సరైన పోస్టును పెట్టారంటూ ఆయన్ను ప్రిన్స్ ఫ్యాన్స్ తో పాటు పలువురు ప్రశంసిస్తున్నారు.
Narendra Modi
Koratala Siva
Andhra Pradesh
Special Category Status

More Telugu News