YV Subba Reddy: టీడీపీవి రాజీ‘డ్రామా’లు.. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శలు

  • నాలుగేళ్లు కాపురం చేశాక ఇప్పుడు రాజీనామాలా?
  • ఇన్నేళ్లలో రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారు?
  • కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతాం
  • స్పష్టం చేసిన వైవీ సుబ్బారెడ్డి
నాలుగేళ్లు కలిసి కాపురం చేసిన టీడీపీ-బీజేపీలు ఇప్పుడు రాజీనామా పేరుతో డ్రామాలకు తెరదీశాయని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. టీడీపీ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఏపీలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనేందుకే టీడీపీ ఈ రాజీనామా డ్రామాలకు తెరదీసిందన్నారు. నాలుగేళ్లుగా కేంద్రంతో కలిసి పనిచేసిన టీడీపీ రాష్ట్రానికి ఒరగబెట్టిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని బీజేపీ ముందే చెప్పినా టీడీపీ కూటమిలో కొనసాగుతూ వచ్చిందని, ఇప్పుడేమో రాజీనామా అంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్డీయే ప్రభుత్వంపై వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టి తీరుతుందని, ఆ తర్వాత తమ రాజీనామాల విషయాన్ని వెల్లడిస్తామని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ ఏ పార్టీతోనూ కలవదని, బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటుందని ప్రచారం చేసింది టీడీపీయేనన్నారు.
YV Subba Reddy
YSRCP
Telugudesam
Special Category Status

More Telugu News