Womens day: మహిళా ఉద్యోగులకు నేడు సెలవు.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

  • నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
  • స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా ప్రకటిస్తూ ఉత్తర్వులు
  • శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
తెలంగాణ ప్రభుత్వం నేడు మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మహిళా దినోత్సవానికి ప్రభుత్వం అంతర్గత ఉత్తర్వులు జారీ చేస్తూ సెలవు ప్రకటించేది.

కానీ ఈసారి మార్చి 8న శాశ్వత సెలవుగా ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల మహిళలకు గవర్నర్ నరసింహన్, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖరరావు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇతర నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
Womens day
Telangana
leave

More Telugu News