Chandrababu: నాడు తల్లిని చంపేశారన్నారు.. మీరు కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నారు: మోదీ తీరుపై చంద్రబాబు

  • నాటి మోదీ అన్న వ్యాఖ్యలను గుర్తు చేసిన చంద్రబాబు
  • నాడు కాంగ్రెస్ చేసిన పనినేనే మీరూ చేస్తున్నారంటూ చంద్రబాబు విమర్శలు
  • ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని హితవు
ఏపీ విభజన గురించి నాడు నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ తల్లిని చంపేసి బిడ్డను బతికించిందని, తాము అధికారంలో ఉండి ఉంటే ఇద్దరినీ బతికించి ఉండేవాళ్లమని నాడు మోదీ అన్న మాటలను గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న మీరు కూడా తల్లిని చంపేస్తారా? అని మోదీని ఉద్దేశించి ప్రశ్నించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అర్ధరాత్రి వరకు ఊరించి ప్రత్యేక హోదా ప్రకటించారని, ఏడాది దాటినా అందుకు సంబంధించిన నిధుల ప్రస్తావనే లేదని పేర్కొన్నారు. ఏపీకి రావాల్సిన నిధులలో ఈ నాలుగేళ్లలో ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వవద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదని సీఎం పేర్కొన్నారు. ప్రజల మనోభావాలతో ఆడుకోవడం సరికాదని బీజేపీకి సూచించారు.
Chandrababu
Andhra Pradesh
Narendra Modi

More Telugu News