Andhra Pradesh: కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలగనున్న టీడీపీ?

  • సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
  • ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి చెప్పనున్న బాబు?
  • రాజీనామా చేయనున్న టీడీపీ మంత్రులు?
ఏపీకి జరిగిన అన్యాయం నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కేంద్ర మంత్రి వర్గం నుంచి టీడీపీ బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో టీడీపీ మంత్రులు రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయాన్ని ఆయనకు తెలియజేయనున్నారు.

కేంద్రం నుంచి టీడీపీ వైదొలగనున్న నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి చంద్రబాబు చెప్పనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. కాగా, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన అనంతరం, టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేద్దామనే దాదాపు అందరు ఎంపీలు చెప్పారని, ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.  
Andhra Pradesh
Chandrababu

More Telugu News