Pakistan: వాళ్లందరూ ఆఖరి వరకూ నిలబడతారనే నమ్మకం కలగట్లేదు: ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్

  • ప్రత్యేక హాదా అంశాన్ని అన్ని పార్టీలు స్వప్రయోజనాలకు వాడుకుంటున్నాయి
  • మాఫియా మాటిస్తే నిలబెట్టుకుంటుంది కానీ, నేతలు మాత్రం నిలబెట్టుకోవడం లేదు
  • కేంద్రంలోని టీడీపీ మంత్రులు ఎప్పుడో రాజీనామా చేయాల్సింది 
అందరినీ కలుపుకుని ఏపీకి  ప్రత్యేకహోదా సాధన ఉద్యమం చేద్దామనుకుంటే, వాళ్లందరూ ఆఖరి వరకూ నిలబడతారనే నమ్మకం తనకు కలగడం లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. మీడియాతో చిట్ చాట్ గా పవన్ మాట్లాడుతూ, ప్రత్యేక హాదా అంశాన్ని అన్ని పార్టీలు తమ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నాయని విమర్శించారు.

కేంద్రంలోని టీడీపీ మంత్రులు ఎప్పుడో రాజీనామా చేయాల్సిందని పవన్ అభిప్రాయపడ్డారు. టీడీపీ, వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో గట్టిగా పోరాడతారనుకున్నానని, మాఫియా మాటిస్తే నిలబెట్టుకుంటుంది కానీ, నేతలు మాత్రం నిలబెట్టుకోవడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అవిశ్వాసంతో ఉపయోగం లేదని, తెలుగు రాష్ట్రాల వివాదాలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు.
Pakistan
Jana Sena

More Telugu News