kcr: తమకు ఎదురులేదనే భ్రమలో కేసీఆర్, కేటీఆర్ ఉన్నారు: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కు, రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ కు ఎదురులేదనే భ్రమలో వారిద్దరూ ఉన్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాజన్న సిరిసిల్లలో నిర్వహించే కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య బస్సు యాత్ర కామారెడ్డి నుంచి వెళ్తూ మాచారెడ్డి చౌరస్తాలో ఆగింది. కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం, ద్విచక్రవాహనాలపై ర్యాలీగా సిరిసిల్లకు వారు చేరుకున్నారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరులను, ఉద్యమకారులను, యువతను, విద్యార్థులను, రైతులను, ప్రజలను మోసం చేసిన ఘనత కేసీఆర్ దేనని, కేసీఆర్ కుటుంబానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం నడుస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిపాలు కావడం ఖాయమని, కేసీఆర్ కుటుంబానికి ఇవే చివరి ఎన్నికలు కానున్నాయని వారు జోస్యం చెప్పారు.
Go Back to Shorts
kcr
KTR
Revanth Reddy

More Telugu News