Cricket: నా తుదిశ్వాస విడిచేవరకు నా భర్తతోనే కలిసి ఉంటా: క్రికెటర్ షమీ భార్య

  • షమీతో పాటు అతడి కుటుంబ సభ్యులపై ఈ రోజు ఉదయం హసీన్ ఆరోపణలు
  • తన భర్తతో విడిపోనని, విడాకులు ఇవ్వనని తెలిపిన హసీన్
  • కోర్టులో కేసు మాత్రం వేస్తా
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీపై అతని భార్య హసీన్ జహాన్ చేసిన ఆరోపణలు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. షమీతో పాటు అతడి కుటుంబ సభ్యులు తనను చంపేందుకు ప్రయత్నించారని, అలాగే ఇతర మహిళలతో తన భర్తకి వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు.

దీనిపై మరోసారి స్పందించిన హసీన్ జహాన్ మాట్లాడుతూ.. తన భర్త నుంచి మాత్రం విడిపోనని, తన తుది శ్వాస విడిచే వరకు ఆయనతోనే కలిసి ఉంటానని తెలిపారు. కోర్టులో కేసు మాత్రం వేస్తానని, కానీ విడాకులు ఇవ్వబోనని చెప్పింది. తన భర్తను మార్చేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, ఆయన తనను భార్యగా ఏనాడు చూడలేదని ఆరోపించారు. తన భర్త పాల్పడ్డ తప్పుడు చర్యలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, కోర్టుకెళతానని తెలిపారు.
Cricket
shami
wife

More Telugu News