Donald Trump: ట్రంప్‌కు చురకలు అంటించిన అమెరికన్‌ టెలివిజన్‌ హోస్ట్‌.. వైరల్ ట్వీట్

షార్ట్స్‌లో చూడండి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవ‌ల చేసిన ట్వీట్‌పై ఆగ్రహం తెచ్చుకున్న ప్రముఖ అమెరికన్‌ టెలివిజన్‌ హోస్ట్‌ జిమ్మీ కిమ్మెల్ తాజాగా చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇటీవల ఆస్కార్ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సారి ఆస్కార్‌ రేటింగ్స్‌ 20 శాతానికి తగ్గిపోవడంతో ఈ విషయంపై డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేస్తూ.. చరిత్రలోనే ఆస్కార్‌కు తక్కువ రేటింగ్స్‌ వచ్చాయని, ఇక మీ అధ్యక్షుడు తప్ప, స్టార్లు లేరని సరదాగా పేర్కొన్నారు. దీంతో, ఆస్కార్‌ వేడుకకు హోస్ట్‌గా వ్యవహరించిన జిమ్మీ కిమ్మెల్.. ట్రంప్ ట్వీట్ పై స్పందిస్తూ 'థ్యాంక్స్‌.. చరిత్రలోనే తక్కువ స్థాయి అధ్యక్షుడు మీరే' అంటూ ట్వీట్ చేసి చురకలంటించారు. 
Go Back to Shorts
Donald Trump
america
Twitter

More Telugu News