Pakistan: భారత్ కు చెందిన నిఘా డ్రోన్ ను కూల్చేశాం: పాకిస్థాన్

  • చిరికోట్ సెక్టార్ లో డ్రోన్ ను గుర్తించాం
  • మా గగనతలంలోకి ప్రవేశించగానే కూల్చేశాం
  • ఇంత వరకు స్పందించని భారత సైన్యం
దాయాది దేశం పాకిస్థాన్ ఓ కీలక ప్రకటన చేసింది. భారత్ కు చెందిన ఓ నిఘా డ్రోన్ ను కూల్చివేశామని పాక్ ఆర్మీ తెలిపింది. కశ్మీర్ లోని నియంత్రణ రేఖను ఆనుకుని ఉన్న చిరికోట్ సెక్టార్లో తొలుత దీన్ని గుర్తించామని... తమ గగనతలంలోకి ప్రవేశించగానే కూల్చి వేశామని పేర్కొంది. డ్రోన్ కు చెందిన శిథిలాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పింది. గత ఏడాది కాలంలో భారత్ కు చెందిన డ్రోన్ ను కూల్చివేయడం ఇది నాలుగోసారి అని తెలిపింది. అయితే, డ్రోన్ కూల్చివేతపై ఇండియన్ ఆర్మీ ఇంతవరకు స్పందించలేదు. 
Pakistan
drone
indian drone

More Telugu News