Pawan Kalyan: కేసీఆర్ తో సన్నిహితంగా ఉంటే తప్పేంటి?: పవన్ కల్యాణ్

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తాను సన్నిహితంగా ఉంటే తప్పేముందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నప్పుడు లేని తప్పు ఇప్పుడు వచ్చిందా? అని అన్నారు. ఈ నెల 14వ తేదీన జరిగే సభలో ఏపీ, తెలంగాణల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామనే విషయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ... '2019లో నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటే, ప్రజలు చేసేస్తారా?' అని ప్రశ్నించారు. సినిమాల్లో నటించాలనే కోరిక ఉన్నప్పటికీ... సమయం లేదని అన్నారు. 
Go Back to Shorts
Pawan Kalyan
KCR
Jagan

More Telugu News