allu arjun: వక్కంతం వంశీకి బన్నీ అదేమాట చెప్పాడట!

  • 'నా పేరు సూర్య' ఫైనల్ రష్ చూసిన బన్నీ 
  • రొమాంటిక్ సీన్స్ తగ్గించమని సూచన 
  • అందుకు ఓకే చెప్పిన దర్శకుడు
వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య ' రూపొందుతోంది. అల్లు అర్జున్ .. అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తోన్న ఈ సినిమాను, మే 4వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఫైనల్ రష్ చూసిన బన్నీ .. వక్కంతం వంశీతో మాట్లాడాడట. ఫస్టాఫ్ లో తనకి .. అనూ ఇమ్మాన్యుయేల్ కి మధ్య సాగే రొమాంటిక్ ట్రాక్ నిడివి ఎక్కువైనట్టుగా అనిపిస్తుందని అన్నాడని చెబుతున్నారు.

ఈ కారణంగా అసలు కంటెంట్ నుంచి ప్రేక్షకుల దృష్టిని మరల్చినట్టు అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని అంటున్నారు. సాధ్యమైనంతవరకూ రొమాంటిక్ సీన్స్ తగ్గించడమే బెటర్ అని అల్లు అర్జున్ అనడంతో, ఆయన సూచన మేరకు ఎడిటింగ్ చేయమని ఎడిటర్ తో వక్కంతం వంశీ చెప్పినట్టుగా టాక్. ఈ సినిమాలో తనకి ఎక్కువ సీన్స్ ఉన్నాయని మురిసిపోతోన్న అనూ ఇమ్మాన్యుయేల్ సంబరానికి కూడా దాదాపు కత్తెర పడిపోయినట్టే .. పాపం.  
allu arjun
anu emmanuel

More Telugu News