Narendra Modi: రెండు లేదా మూడు రోజులు... మొత్తం తేలిపోతుంది: టీడీపీ ఎంపీ, నటుడు మురళీమోహన్

  • మోదీ సర్కారుది బాధ్యతారాహిత్యం
  • ఇస్తామన్న ప్యాకేజీ కూడా ఇవ్వలేదు
  • బీజేపీని ప్రజలు క్షమించబోరు
రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం సుస్పష్టం చేయడంపై స్పందించిన టీడీపీ ఎంపీ, నటుడు మురళీమోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు, కేంద్ర ప్రభుత్వంలో కలిసుండటంపై రెండు మూడు రోజుల్లో మొత్తం తేలిపోతుందని అన్నారు.

నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన స్థితిలో ఉన్న నరేంద్ర మోదీ సర్కారు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన, ఏపీకి అంతిచ్చాం, ఇంతిచ్చాం అంటూ బీజేపీ నేతలు దొంగలెక్కలు చెబుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోగా, ఇస్తామన్న ప్యాకేజీని కూడా ఇచ్చేది లేదని మాట మార్చిన బీజేపీని ప్రజలు క్షమించబోరని అన్నారు. జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను చంద్రబాబు ఇప్పటికే తెలుసుకున్నారని, నిర్ణయం తీసుకోవడమే మిగిలిందని అన్నారు.
Narendra Modi
Murali Monaj
Andhra Pradesh
Special Category Status
BJP
Telugudesam

More Telugu News