Kamineni Srinivas: ఏం మాట్లాడతారో చూసి... చంద్రబాబు క్యాబినెట్ నుంచి బీజేపీ మంత్రుల రాజీనామా!

  • క్లైమాక్స్ చేరిన టీడీపీ - బీజేపీ పొత్తు
  • నేడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్న బాబు
  • బాబు ప్రసంగం తరువాత రాజీనామాలు
  • సన్నిహితులకు చెప్పిన కామినేని, పైడికొండల
బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు క్లైమాక్స్ కు చేరింది. గత వారం పది రోజులుగా జరుగుతున్న మాటల యుద్ధం కోటలు దాటగా, నిన్న చంద్రబాబు చేసిన కామెంట్స్ తో మిత్ర బంధం తెగదెంపులకే ఆయన నిర్ణయించుకున్నారని భావిస్తున్న బీజేపీ, అంతకన్నా ముందుగా తమంతట తామే ఏపీ ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని భావిస్తోంది. అయితే, అంతకు ముందుగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చంద్రబాబు ఏం మాట్లాడతారో చూద్దామని, ఆ తరువాత నేడే రాజీనామాలు సమర్పిద్దామని బీజేపీ మంత్రులు భావిస్తున్నారని సమాచారం.

ఈ విషయంపై ఇప్పటికే అధిష్ఠానంతో మాట్లాడిన మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు, ప్రస్తుతం సీఎం చంద్రబాబు ప్రకటన కోసమే వేచి చూస్తున్నామని తమ సన్నిహితుల వద్ద వెల్లడించారు.
Kamineni Srinivas
Paidikondala Manikyalarao
Telugudesam
BJP
Chandrababu

More Telugu News