ntr: రాజమౌళి సినిమా కోసం అమెరికా వెళ్లిన ఎన్టీఆర్ .. చరణ్!

షార్ట్స్‌లో చూడండి
ఎన్టీఆర్ .. చరణ్ .. చెరో బ్యాగ్ పట్టుకుని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. దాంతో ఇద్దరూ ఒకే చోటుకు వెళుతున్నారనే విషయం చూసేవారికి అర్థమైపోయింది. ఈ ఇద్దరూ కూడా అమెరికా వెళ్లారట .. అదీ రాజమౌళి సినిమా కోసం అనేది తాజా సమాచారం.

ఎన్టీఆర్ .. చరణ్ లతో రాజమౌళి ఒక మల్టీ స్టారర్ చేయనున్నారు. ఆ సినిమాకి సంబంధించిన వర్క్ షాప్ ను కూడా ఆయన నిర్వహించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ వర్క్ షాప్ ను ఆయన నిర్వహించేది అమెరికాలోనట. అక్కడే ఎన్టీఆర్ .. చరణ్ లపై ఫోటో షూట్ ను కూడా ప్లాన్ చేశారట. ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ సమయంలో ఈ ఫోటోలను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తి ఇక్కడి నుంచే మొదలైపోయిందని చెప్పాలి.  
Go Back to Shorts
ntr
charan

More Telugu News