mohammed shami: క్రికెటర్ షమీపై షాకింగ్ కామెంట్స్ చేసిన భార్య.. చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ ఆగ్రహం!

  • నన్ను చంపడానికి కూడా ప్రయత్నించారు
  • శారీరకంగా ఎంతో టార్చర్ పెట్టారు
  • ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీపై అతని భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తకు అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ ఆమె తెలిపారు. వాట్సాప్, ఫేస్ బుక్ లలో పలువురు మహిళలతో షమీ చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్లను ఆమె ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. అంతేకాదు, షమీ, అతని కుటుంబసభ్యులు తనను చంపేందుకు కూడా యత్నించారని తెలిపారు. షమీ కుటుంబంలోని అందరూ తనను టార్చర్ పెట్టారని ఆరోపించారు. అతని తల్లి, సోదరుడు తనను దుర్భాషలాడారని చెప్పారు. ఈ ఉదయం 2 గంటల నుంచి టార్చర్ కొనసాగిందని, తనను చంపేందుకు కూడా యత్నించారని తెలిపారు.

దక్షిణాఫ్రికా టూర్ నుంచి వచ్చాక... తనను షమీ శారీరకంగా హింసించాడని హసీన్ చెప్పారు. తనను కొట్టాడని ఆరోపించారు. గత కొంత కాలంగా తన పట్ల షమీ ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పులు తెలుసుకుంటాడనే ఆశతో, అతనికి తగినంత సమయం ఇచ్చానని... తాను మౌనంగా ఉన్నానని... అయినా షమీలో మార్పు రాలేదని, అతని తప్పులకు తనను శిక్షించాడని చెప్పారు.

తన కుటుంబం, కూతురు కోసం తాను ఎంతో భరించానని... కానీ, షమీ మాత్రం తనను టార్చర్ చేస్తూనే ఉన్నాడని హసీన్ తెలిపారు. ఈ దారుణాలన్నీ తాను భరించగలిగానని... కానీ, ఇతర మహిళలతో అతనికి సంబంధాలు ఉన్నాయనే విషయం తెలియగానే, మనసు విరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై తాను ఏమాత్రం క్షమించలేనని... తన వద్ద ఉన్న అన్ని ఆధారాల సాయంతో షమీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
mohammed shami
wife
hasin jahan
torture
extra marital affairs

More Telugu News