sivaprasad: టీడీపీ ఎంపీ శివప్రసాద్ ను అడ్డుకున్న సెక్యూరిటీ

  • ఏపీ ప్రజల నోట్లో మోదీ నీరు, మట్టి కొట్టి పోయారంటూ నిరసన
  • కావడి మోస్తూ పార్లమెంటులోకి వెళ్లేందుకు యత్నం
  • ఇలాంటివాటిని లోపలకు అనుమతించబోమన్న సెక్యూరిటీ
ఏపీ రాజధాని అమరావతికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇస్తూ... ముంతడు నీటిని, మట్టిని ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో కొట్టి పోయారంటూ టీడీపీ ఎంపీ శివప్రసాద్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఈరోజు ఆయన పార్లమెంటు ప్రాంగణంలో వినూత్నంగా నిరసన తెలిపారు. ఓ కుండలో నీరు, మరో కుండలో మట్టి ఉన్న కావడిని మోస్తూ ఆయన నిరసన వ్యక్తం చేశారు.

వీటిని స్పీకర్ కు అందించి, ఆమె ద్వారా ప్రధానికి పంపించాలని కోరుతానని చెప్పారు. అనంతరం కావడిని మోస్తూ పార్లమెంటులోకి వెళ్లేందుకు యత్నించారు. మెట్లు ఎక్కిన ఆయనను పార్లమెంటు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఇలాంటివాటిని లోపలకు అనుమతించబోమని నవ్వుతూ చెప్పారు. కాసేపు అక్కడే ఉన్న శివప్రసాద్... చివరకు మెట్లు దిగి, కిందకు వచ్చేశారు. శివప్రసాద్ నిరసన కార్యక్రమాన్ని వివిధ పార్టీలకు చెందిన ఎంపీలంతా ఆసక్తిగా గమనించారు.
sivaprasad
Telugudesam
mp
parliament
protest
security

More Telugu News