Chandrababu: ఏపీకి రాయితీలు లేవంటూ ఆర్థికశాఖ చేసిన ప్రకటనపై చంద్రబాబు మండిపాటు.. తమ నేతలతో కీలక చర్చ

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా, పన్ను రాయితీలు ఉండబోవంటూ కేంద్ర ఆర్థిక శాఖ చేసిన ప్రకటనపై ఏపీ సీఎం చంద్రబాబు తమ పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ఢిల్లీలో జరుగుతోన్న పరిణామాలపై, కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన చేసినట్లు మీడియాలో వచ్చిన అంశాలపై టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు వివరించారు. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎందుకు జటిలం చేస్తుందో అర్థం కావట్లేదని అన్నారు. రాష్ట్రానికి ఏమీ చేయమన్న రీతిలో కేంద్రం వ్యవహరిస్తోందన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని అన్నట్లు తెలిసింది. తదుపరి ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై చంద్రబాబు కీలక చర్చలు జరుపుతున్నారు. 
Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh
Special Category Status

More Telugu News