Chandrababu: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిరసన చేబట్టిన ఎమ్మెల్యే గణేష్ కు క్లాస్ తీసుకున్న చంద్రబాబు!

  • మోదీని కించపరిచే రీతిలో నిరసన చేపట్టిన గణేష్
  • ఎదుటివారిని కించపరచవద్దన్న చంద్రబాబు
  • నిరసన కార్యక్రమాలు హుందాగా ఉండాలంటూ సూచన
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ చేపట్టిన నిరసన కార్యక్రమం టీడీపీ, బీజేపీ నేతల మధ్య అగ్గి రాజేసింది. రైల్వే జోన్ ను డిమాండ్ చేస్తూ ఆయన చేపట్టిన నిరసన కార్యక్రమంలో... మోదీ వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి మెడలు వంచుతున్నట్టు ప్రదర్శించారు. దీంతో, బీజేపీ నేతలు గణేష్ పై ఫైర్ అయ్యారు. దీనికి కూడా గణేష్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో గణేష్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. ఎదుటివారిని కించపరిచే విధంగా నిరసన కార్యక్రమాలను చేపట్టవద్దని గణేష్ కు సూచించారు. నిరసన కార్యక్రమాలు హుందాగా ఉండాలని చెప్పారు.
Chandrababu
vasupalli ganesh
Narendra Modi

More Telugu News