Narendra Modi: మోదీని కించపరిచే ఫ్లెక్సీలపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. తొలగించాలని ఆదేశం!

  • మోదీపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన కాట్రగడ్డ బాబు
  • మండిపడ్డ బీజేపీ నేతలు
  • ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలంటూ చంద్రబాబు ఆదేశం
ఏపీలో టీడీపీ, బీజేపీల మధ్య వివాదం ముదిరిన సంగతి తెలిసిందే. ఏపీ ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ నెరవేర్చడం లేదంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా టీడీపీ నేత కాట్రగడ్డ బాబు విజయవాడలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు బీజేపీ నేతలకు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. బీజేపీ నేతలు సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు, మాధవ్ లు తమ అసహనాన్ని బహిరంగంగానే వ్యక్తపరిచారు. బీజేపీని, ప్రధాని మోదీని కించపరిచే చర్యలను టీడీపీ నేతలు మానుకోవాలని అన్నారు.

ఈ నేపథ్యంలో మోదీపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని నేతలకు ఆదేశాలు జారీ చేశారు. కించపరిచే రీతిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయవద్దని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సదరు ఫ్లెక్సీలను వెంటనే తొలగించారు. 
Narendra Modi
Chandrababu
katragadda babu

More Telugu News