BJP: మరో కొత్త పార్టీ పెడతానని ప్రకటించి ఆశ్చర్యపరిచిన ఉపేంద్ర!

  • నాలుగు నెలల క్రితం కొత్త పార్టీ పెట్టిన ఉపేంద్ర 
  • ‘కర్ణాటక ప్రజ్ఞాయవంత జనతా పార్టీ’(కేపీజేపీ) పేరుతో పార్టీ పెట్టి రాజకీయాల్లోకి
  • పార్టీలో అంతర్గత విభేదాలు.. కేపీజేపీకి ఉపేంద్ర గుడ్‌ బై
  • ఆ పార్టీని వదిలి ఉపేంద్ర బీజేపీలో చేరతారని ప్రచారం
నాలుగు నెలల క్రితం కన్నడ సినీ నటుడు ఉపేంద్ర ‘కర్ణాటక ప్రజ్ఞాయవంత జనతా పార్టీ’(కేపీజేపీ) ని ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, పార్టీలోని కొందరితో వచ్చిన విభేదాల వల్ల ఆయన ఇటీవల ఆ పార్టీని వదలి బయటకు వచ్చేశారు. దీంతో ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన ఉపేంద్ర.. తాను మరో కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. తాను బీజేపీలో చేరనని, మరోపార్టీ స్థాపించి ప్రజల ముందుకు వస్తానని ఆయన చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కొన్ని నెలల క్రితం అవినీతిని అంతమొందిస్తానని పేర్కొంటూ కొందరితో కలిసి ఆయన తనపార్టీలో తన భార్య, సోదరుడికి అగ్రస్థానాలు ఇచ్చారు. దీంతో ఆయన తీరుపై సొంత పార్టీ నేతలే మండిపడ్డారు.

BJP
upendra
Karnataka

More Telugu News