హెబ్బా పటేల్ సన్నబడిందట .. మళ్లీ అదే హీరో జోడీగా ఛాన్స్ !
- నాగ అశ్విన్ హీరోగా లవ్ స్టోరీ
- ఆయన జోడీగా మళ్లీ హెబ్బా
- త్వరలో సెట్స్ పైకి
తనకి అవకాశాలు రాకపోవడానికి .. బరువు పెరగడం కూడా ఒక కారణమని భావించిన ఆమె, బాగానే కసరత్తు చేసి సన్నబడిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఫిట్ నెస్ పై దృష్టి పెట్టిన ఈ సుందరి .. మరో ఛాన్స్ ను అందుకుంది. లండన్ గణేశ్ నిర్మించనున్న ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీ కోసం హెబ్బా పటేల్ ను తీసుకున్నారు. ఈ సినిమాలో నాగ అన్వేష్ హీరోగా చేయనున్నాడు. గతంలో ఈ ఇద్దరూ కలిసి 'ఏంజెల్' సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అయినా హెబ్బాకి కలిసొస్తుందో లేదో చూడాలి.