prakash kovelamudi: రాఘవేంద్రరావు తనయుడి కొత్త సినిమా 'మెంటల్ హై క్యా'!

  • కమర్షియల్ చిత్రాల దర్శకేంద్రుడు.. విభిన్న చిత్రాల దర్శకుడిగా ప్రకాశ్ 
  • 'మార్నింగ్ రాగా', 'అనగనగా ఒక ధీరుడు', 'సైజ్‌ జీరో' సినిమాలతో గుర్తింపు
  • రాజ్ కుమార్ రావ్, కంగనా రనౌత్ లతో 'మెంటల్ హై క్యా' సినిమా
అనగనగా ఒక ధీరుడు, సైజ్‌ జీరో.. సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్‌ కోవెలమూడి కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. తండ్రి కమర్షియల్ సినిమాల్లో దర‍్శకేంద్రుడిగా పేరుతెచ్చుకోగా, ప్రకాశ్ అభిరుచి గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. మార్నింగ్ రాగా సినిమాతో జాతీయ స్థాయి దర్శకుడిగా నిరూపించుకున్న ప్రకాశ్, సుదీర్ఘ విరామం తరువాత జాతీయ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

బాలీవుడ్ యువ విలక్షణ నటుడు రాజ్‌ కుమార్‌ రావ్, స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో 'మెంటల్‌ హై క్యా' అనే సినిమాను రూపొందిస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమాను సైకలాజికల్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిస్తున్నట్టు తెలిపాడు. కాగా, ఈ సినిమాను బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌, కర్మ మీడియా అండ్‌ ఎంటర్‌ టైన్మెంట్‌  సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేయగా, సోషల్ మీడియాను అది ఆకట్టుకుంటోంది. 
prakash kovelamudi
raghavendrarao
kangana ranaut
rajkumar rao
mental hai kya

More Telugu News