gujarath accident: గుజరాత్ ఘోర ప్రమాదంపై ప్రధాని స్పందన... మృతుల కుటుంబాలకు సానుభూతి

  • దురదృష్టకరం, బాధాకరమన్న ప్రధాని
  • ఆప్తులను కోల్పోయిన వారికి సానుభూతి వ్యక్తీకరణ
  • గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
గుజరాత్ లో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. రంఘోలా వద్ద జరిగిన ప్రమాదంలో తమ ఆప్తులను కోల్పోయిన వారందరికీ సానుభూతి తెలియజేశారు. ‘‘ఈ ప్రమాదం నిజంగా దురదృష్టకరం, బాధాకరం. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నా ఆకాంక్ష’’ అంటూ ప్రధాని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. పెళ్లి బృందాన్ని తీసుకువెళుతున్న ఓ ట్రక్ ఈ రోజు తెల్లవారుజామున రాజ్ కోట్-భావ్ నగర్ హైవేపై రంఘోలా వద్ద అదుపుతప్పి కాల్వలోకి దూసుకుపోవడంతో 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
gujarath accident
Prime Minister
modi

More Telugu News