Priyanka Chopra: 'ఆస్కార్' ఉత్సవానికి ప్రియాంక హాజరుకాకపోవడానికి కారణమిదేనా..?

  • ఆస్కార్ అవార్డుల వేదికపై కనిపించని బాలీవుడ్ తార
  • అనారోగ్యమే కారణమని ఇన్‌‍స్టాగ్రామ్‌లో వెల్లడి
  • అవార్డులకు నామినేట్ అయిన వారికి శుభాకాంక్షలు
నటనలోనే కాదు...ఎలాంటి ఈవెంట్‌నైనా సరే చక్కగా ముందుకు తీసుకెళ్లగల స్టార్లలో బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా ఒకరు. ఎంతో చలాకీగా ఉంటూ గెస్ట్‌లను ఉత్సాహపరుస్తూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించగల టాలెంట్ ఉన్న నటీమణి ఆమె. కానీ, ఈ సారి నిర్వహించిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ తళుకుల తార ఎక్కడా కనిపించలేదు.

ఆమె కనిపిస్తుందేమోనని అభిమానులు ముఖ్యంగా భారతదేశ ఆభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. వారందరికీ నిరాశే మిగిలింది. ఆమెకు ఆహ్వానం అందలేదోమోనని కొందరు భావించారు. మరికొందరు ఇతర కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు. ఎట్టకేలకు తానే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో ద్వారా గైర్హాజరుకు గల కారణాలను వివరించింది. అనారోగ్యం వల్లే తాను ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరుకాలేకపోయానని ఆమె చెప్పింది. అవార్డులకు నామినేట్ అయిన వారికి శుభాకాంక్షలు తెలిపింది. ఆస్కార్-2018 విజేతలను తెలుసుకునేందుకు తానెంతో ఆత్రుతగా ఉన్నానని పేర్కొంది.
Priyanka Chopra
Oscars
Instagram

More Telugu News