shammi: బాలీవుడ్ సీనియర్ నటి షమ్మి మృతి

  • షమ్మి వయసు 89 ఏళ్లు
  • ఆనారోగ్యంతో మృతి
  • 200కు పైగా సినిమాల్లో నటించిన షమ్మీ
బాలీవుడ్ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి షమ్మి తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 89 ఏళ్లు. షమ్మి మరణవార్తను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సందీప్ కోస్లా వెల్లడించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కూడా షమ్మి మృతిపై స్పందించారు. 'షమ్మి ఆంటీ చాలా మంచి నటి. మంచి మనసున్న వ్యక్తి. ఎన్నో ఏళ్లపాటు నటిగా రాణించారు. మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నా' అంటూ ట్వీట్ చేశారు.

కమెడియన్ గా షమ్మి మంచి పేరు తెచ్చుకున్నారు. 200కు పైగా సినిమాల్లో నటించారు. ఆమె నటించిన 'హమ్ సాత్ సాత్ హై', 'గోపీ కిషన్', 'హమ్', 'కూలీ నంబర్ 1' తదితర చిత్రాలు ఘన విజయం సాధించాయి. బుల్లితెరపై కూడా ఆమె చాలా షోస్ లో నటించారు.
shammi
dead
Amitabh Bachchan
sandeep khosla
Bollywood

More Telugu News