Chandrababu: అద్దె గూండాలతో టీడీపీ ధర్నాలు... చంద్రబాబు సమాధానం చెప్పాలి: విష్ణుకుమార్ రాజు

  • విశాఖలో మోదీకి వ్యతిరేకంగా ధర్నా
  • ధర్నా చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి
  • చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందే
  • బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు
గూండాలను, రౌడీలను అద్దెకు తీసుకువచ్చి తెలుగుదేశం పార్టీ ధర్నాలు చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ మెడలు వంచుతామంటూ విశాఖలో ఎమ్మెల్యే వాసుపల్లి ధర్నా చేయడాన్ని ప్రశ్నించిన ఆయన, ఈ ధర్నా కోసం డబ్బులిచ్చి మనుషులను తరలించారని, దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, వెంటనే వాసుపల్లిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాము మిత్రధర్మంలో ఉన్నాం కాబట్టే సంయమనాన్ని పాటిస్తున్నామని, తమ ఎమ్మెల్యే ఎవరైనా చంద్రబాబు మెడలు వంచుతామంటూ ధర్నా చేస్తే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో సీఎం మౌనంగా ఉంటే ఆయన ప్రోత్సాహం వల్లే ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారని భావించాల్సి వుంటుందని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి వెంటనే తన ఎమ్మెల్యేలను, నేతలను అదుపులో పెట్టుకునే చర్యలు తీసుకోవాలని, లేకుంటే బీజేపీ శ్రేణులు సైతం నిరసనలకు దిగుతాయని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు.
Chandrababu
Vizag
Vishnu Kumar raju
BJP
Telugudesam
Narendra Modi

More Telugu News