భారత ఆర్మీ మెరుపుదాడి.. సుంజువాన్ దాడికి ప్రతీకారం.. ఉగ్రవాది ముఫ్తీ వఖాస్ హతం
- గత నెలలో సుంజువాన్ ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి
- ఐదుగురు అధికారుల వీర మరణం
- భారత సైన్యం మెరుపు దాడిలో సుంజువాన్ సూత్రధారి హతం
సుంజువాన్ ఉగ్రదాడితోపాటు లత్పోరలోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై జరిగిన ఆత్మాహుతి దాడికి కూడా వఖాసే సూత్రధారి. పాకిస్థాన్‌కు చెందిన వఖాస్ 2017లో కశ్మీర్లోకి చొరబడ్డాడు. జైషే ఆపరేషనల్ కమాండర్‌గా పనిచేస్తున్నాడు. గత నెలలో జరిగిన సుంజువాన్ ఉగ్రదాడిలో ఇద్దరు జూనియర్ కమిషన్డ్ అధికారులు సహా ఐదుగురు సిబ్బంది అమరులయ్యారు.