Andhra Pradesh: మూడు రోజుల్లో స్పష్టత వస్తుంది: కంభంపాటి హరిబాబు

  • విభజన హామీలు, చట్టంలో పొందుపరిచిన అంశాలపై చర్చించాం
  • ఆర్థికపరమైన అంశాలపై కూడా చర్చించాం
  • ప్రత్యేక హోదాకు సమానమైన ప్రయోజనాలను రాష్ట్రానికి ఇవ్వాలని కోరాం
  • నిధులు ఇచ్చే విషయంలో ఆలస్యం జరుగుతుందన్న భావన ఉంది
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా, నిధులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో టీడీపీ నేతలు ఢిల్లీలో చర్చించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కూడా పాల్గొన్నారు. భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... విభజన హామీలు, చట్టంలో పొందుపరిచిన అంశాలపై తాము జైట్లీతో చర్చించామని అన్నారు. ఆర్థికపరమైన అంశాలపై కూడా చర్చ జరిగిందని అన్నారు.

ప్రత్యేక హోదాకు సమానమైన ప్రయోజనాలను రాష్ట్రానికి ఇవ్వాలని కోరామని కంభంపాటి హరిబాబు వ్యాఖ్యానించారు. నిధులు ఇచ్చే విషయంలో ఆలస్యం జరుగుతుందన్న భావన ఉందని, ఆర్థికలోటు భర్తీ అంశంపై చర్చలు జరుగుతున్నాయని, మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు.  
Andhra Pradesh
haribabu
BJP
Arun Jaitly

More Telugu News