Arun Jaitly: ఢిల్లీలో అరుణ్ జైట్లీతో టీడీపీ నేతల కీలక భేటీ

  • ఆర్థిక శాఖ నార్త్ బ్లాక్‌లో సమావేశం
  • ఏపీ విభజన వ్యవహారాలు, ఆర్థికపరమైన విషయాలపై చర్చ
  • సమావేశానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి, టీడీపీ నేతలు సుజనా, యనమల, రామ్మోహన్ హాజరు
 కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిందని టీటీడీపీ నేతలు మండిపడుతోన్న విషయం తెలిసిందే. పార్లమెంటులోనూ వారు నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ.. టీడీపీ నేతలతో చర్చిస్తున్నారు. ఆర్థిక శాఖ నార్త్ బ్లాక్‌లో ఈ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కూడా పాల్గొంటున్నారు. టీడీపీ నేతలు సుజనా చౌదరి, యనమల రామకృష్ణుడు, రామ్మోహన్ నాయుడు ఏపీ విభజన సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సాయంపై వివరిస్తున్నారు.
Arun Jaitly
Andhra Pradesh
New Delhi

More Telugu News