Congress: అందుకే, కేసీఆర్ ను బీజేపీ రంగంలోకి దించింది: రేవంత్ రెడ్డి

  • తెరవెనుక జరుగుతున్న పరిణామాలను ప్రజలు గ్రహించాలి
  • కేసుల నుంచి బయటపడేందుకే కేసీఆర్ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు
  • కాంగ్రెస్ తో కలిసేందుకు చంద్రబాబు మొగ్గుచూపుతున్నారు : కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి
థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరముందని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి ఆయనపై టీ- కాంగ్రెస్ నాయకుల విమర్శల వర్షం కొనసాగుతూనే ఉంది. తాజాగా, టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కేసీఆర్ పై వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో కలిసేందుకు చంద్రబాబు మొగ్గుచూపుతున్నారని, అందుకే, కేసీఆర్ ను బీజేపీ రంగంలోకి దించిందని విమర్శించారు.

తెరవెనుక జరుగుతున్న పరిణామాలను ప్రజలు గ్రహించాలని, తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకే కేసీఆర్ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్య పరీక్షల పేరిట ఢిల్లీ వెళుతున్న కేసీఆర్, అక్కడి కేంద్ర పెద్దలను కలుస్తున్నారని విమర్శించారు.  
Congress
Revanth Reddy
KCR

More Telugu News