bjp: ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది: విష్ణుకుమార్ రాజు

  • ఏపీకి హోదా విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
  • అసెంబ్లీలో అన్ని విషయాలు చర్చిస్తాం : విష్ణు కుమార్ రాజు
  • బీజేపీ శీలాన్ని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదు
  • రాయలసీమ డిక్లరేషన్ ను అసెంబ్లీలో ప్రస్తావిస్తాం : సోము వీర్రాజు
ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరోమారు స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రేపటి నుంచి ఏపీ అసెంబ్లీలో అన్ని విషయాలు చర్చిస్తామని చెప్పారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. కాగా, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, ఓ ఎంపీ తాను తెచ్చుకున్న పేపర్ ను లోక్ సభలో మూడు నిమిషాలు చూసి చదివితే ఆయనకు సన్మానాలు చేశారని విమర్శించారు. బీజేపీ శీలాన్ని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని, రాయలసీమ డిక్లరేషన్ ను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
bjp
vishnu kumar raj
somu veeraj

More Telugu News