K Kavitha: బీజేపీ, కాంగ్రెస్‌లపై ఎంపీ కవిత ఫైర్‌!

  • ఆయా పార్టీలు దేశాన్ని పక్కదోవ పట్టిస్తున్నాయి
  • ఈ రోజు పార్లమెంట్‌లో మా పార్టీ నేతలు రిజర్వేషన్లపై నిరసన
  • ఏపీకి ఇచ్చిన హామీలపై ఆ రాష్ట్ర ఎంపీలు ఆందోళన 
  • తమిళనాడు సభ్యులు కూడా కావేరీ జలాల వివాదంపై నిరసన
బీజేపీ, కాంగ్రెస్‌లపై టీఆర్ఎస్ ఎంపీ కవిత విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలు దేశాన్ని పక్కదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. ఈ రోజు పార్లమెంట్‌లో తమ పార్టీ నేతలు రిజర్వేషన్లపై నిరసన తెలిపారని, మరోవైపు ఏపీకి ఇచ్చిన హామీలపై ఆ రాష్ట్ర ఎంపీలు ఆందోళన తెలిపారని ఆమె అన్నారు. తమిళనాడు సభ్యులు కూడా కావేరీ జలాల వివాదంపై ప్రశ్నించారని ఆమె అన్నారు. మూడు రాష్ట్రాల ఎంపీలు లేవనెత్తిన సమస్యలపై ప్రధానమంత్రి మోదీ స్పందించాని ఆమె అన్నారు.

 కాగా వాయిదా అనంతరం రాజ్యసభ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. సభలో గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ సభను రేపటికి వాయిదా వేశారు. 
K Kavitha
TRS
Special Category Status

More Telugu News