Vijayasai Reddy: 'జేఎఫ్సీ'కి ప్రొడ్యూసర్, డైరెక్టర్ చంద్రబాబే... పవన్ ఓ పెయిడ్ ఆర్టిస్టు: విజయసాయిరెడ్డి

  • ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పేరిట నాటకం
  • తెరవెనకున్నది చంద్రబాబే
  • వైసీపీతోనే ప్రత్యేక హోదా సాధ్యం
  • కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పై స్పష్టత లేదు
ప్రజలను మభ్యపెట్టేందుకే జనసేన పార్టీ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పేరిట నాటకం ఆడుతున్నదని, తెరవెనుక ఉండి ఈ తతంగాన్ని నడిపిస్తున్నది చంద్రబాబునాయుడేనని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, జేఎఫ్సీ దర్శకుడు, నిర్మాత చంద్రబాబేనని, పవన్, ఉండవల్లి తదితర సభ్యులంతా పెయిడ్ ఆర్టిస్టులని ఎద్దేవా చేశారు.  

వైసీపీతోనే ప్రత్యేక హోదా సాధ్యమని, కేంద్ర మంత్రి వర్గం నుంచి టీడీపీ వైదొలగి, అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జేఎఫ్సీతో ఒరిగేదేమీ లేదని అభిప్రాయపడ్డ ఆయన, కమిటీలు, నివేదికలతో ప్రజలకు కలిగే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రకటించిన తృతీయ కూటమిపై ఇప్పటివరకూ ఇంకా ఎటువంటి స్పష్టతా లేదని, కాబట్టి ఆ విషయంలో తమ పార్టీ ప్రస్తుతానికి స్పందించబోదని తెలిపారు.
Vijayasai Reddy
Chandrababu
Pawan Kalyan
JFC

More Telugu News