Sridevi: శ్రీదేవిని తలచుకున్న ఆస్కార్ వేదిక!

  • శ్రీదేవిని గుర్తు చేసుకున్న ఆస్కార్
  • పేరు వినగానే చప్పట్లతో మారుమోగిన ఆడిటోరియం
  • బాలీవుడ్ నటుడు శశికపూర్ ను కూడా
గతవారంలో మరణించిన భారత సినీ నటి శ్రీదేవిని ఆస్కార్ వేదికపై తలచుకున్నారు. మెమోరియన్ విభాగంలో శ్రీదేవితో పాటు ఈ సంవత్సరం మరణించిన బాలీవుడ్ నటుడు శశికపూర్ కు కూడా నివాళులు అర్పించారు. వీరిద్దరి చిత్రాలను బిగ్ స్క్రీన్ పై చూపుతూ చలనచిత్ర రంగానికి వీరు చేసిన సేవలను సభా వేదిక గుర్తు చేసుకుంది. శ్రీదేవి పేరు వినపడగానే ఆడిటోరియం మొత్తం ఆమెను గుర్తు చేసుకుంటూ చప్పట్లు కొట్టింది. ఈ సంవత్సరం మెమోరియన్ సెగ్మెంట్ లో భారత్ తరఫున వీరిద్దరి పేర్లు మాత్రమే వినిపించాయి.
Sridevi
Oscar
Sashikapoor

More Telugu News