పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన నితిన్
- ట్విట్టర్ వేదికగా పెళ్లి పుకార్లకు పుల్ స్టాప్
- పెళ్లి దుస్తులు శ్రీనివాస కల్యాణం చిత్రంలోనివని వెల్లడి
- దిల్ రాజు నిర్మాణంలో నితిన్ కొత్త సినిమా షురూ
పెళ్లి దుస్తుల్లో ఉన్న తన ఫొటోలపై అతను క్లారిటీ ఇచ్చాడు. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న తన తదుపరి చిత్రం 'శ్రీనివాస కల్యాణం'కి సంబంధించినవని అతను చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో అతనికి జోడీగా అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా నటిస్తోంది. ఆదివారం ప్రారంభమయిన ఈ చిత్రం షూటింగ్కు సంబంధించిన ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.