రామేశ్వరంలో శ్రీదేవి అస్థికల నిమజ్జనం...!
- రామేశ్వరంలో హిందూ పద్ధతిలో అస్థికల నిమజ్జనం
- కార్యక్రమంలో పాల్గొన్న బోనీ కపూర్, జాన్వీ, ఖుషీ
- తల్లిని తలచుకుని విలపించిన కుమార్తెలు
ఈ సందర్భంగా ఇద్దరు కుమార్తెలు తమ తల్లిని తలచుకుని విలపించారు. గతనెల 24న దుబాయిలో ఓ వివాహానికి వెళ్లిన సందర్భంగా శ్రీదేవి ప్రమాదవశాత్తుగా బాత్ టబ్‌లో పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆమె మరణవార్త వినగానే యావత్ భారతం ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురయింది. ఆమె మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటని పలువురు సినీ ప్రముఖులు సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులు పేర్కొన్నారు.