వినూత్నంగా వివాహ వేడుక...శుభాకాంక్షలు చెప్పిన గవర్నర్
- శ్రీకాకుళం జిల్లాకు చెందిన కానిస్టేబుల్ రమేష్ వివాహం
- 23 మంది రక్తదానం
- అంధులతో ఆర్కెస్ట్రా
వివాహాన్ని పురస్కరించుకుని 23 మంది యువకులు స్వచ్చందంగా రక్తదానం చేశారు. తన వివాహానికి హాజరైన ప్రతి ఒక్కరికీ రమేష్ దంపతులు కడియం నుంచి గులాబీ మొక్కలను తెప్పించి పంపిణీ చేశారు. వివాహవేడుకలో అంధులను ప్రోత్సహించేందుకు వారితో ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. ఈ వివరాలు తెలుసుకున్న గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.