marriage: వినూత్నంగా వివాహ వేడుక...శుభాకాంక్షలు చెప్పిన గవర్నర్

  • శ్రీకాకుళం జిల్లాకు చెందిన కానిస్టేబుల్ రమేష్ వివాహం
  • 23 మంది రక్తదానం
  • అంధులతో ఆర్కెస్ట్రా
 తమ వివాహవేడుకను సామాజిక స్పృహతో నిర్వహించిన కానిస్టేబుల్ దంపతులకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే...శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం అన్నంపేట గ్రామానికి చెందిన కానిస్టేబుల్‌ పరిడాల రమేష్‌, అశ్వనిల వివాహం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది.

వివాహాన్ని పురస్కరించుకుని 23 మంది యువకులు స్వచ్చందంగా రక్తదానం చేశారు. తన వివాహానికి హాజరైన ప్రతి ఒక్కరికీ రమేష్ దంపతులు కడియం నుంచి గులాబీ మొక్కలను తెప్పించి పంపిణీ చేశారు. వివాహవేడుకలో అంధులను ప్రోత్సహించేందుకు వారితో ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. ఈ వివరాలు తెలుసుకున్న గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. 
marriage
social concept marriage
governor greetings

More Telugu News