Virat Kohli: బోనీకపూర్ ను పరామర్శించిన కోహ్లీ దంపతులు

  • ఫిబ్రవరి 24న దుబాయ్ లోని హోటల్ లో మృతి చెందిన శ్రీదేవి
  • శ్రీదేవి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అనుష్క శర్మ
  • బోనీకపూర్ ను భర్తతో కలిసి పరామర్శించిన అనుష్క
దివంగత దిగ్గజ నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ ను టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, ఆయన సతీమణి, సినీ నటి, అనుష్క శర్మ పరామర్శించారు. షూటింగ్ లో బిజీగా ఉండడంతో అనుష్క, శ్రీదేవి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆ దంపతులిద్దరూ బోనీ కపూర్‌ నివాసానికి వెళ్లి, వారిని పరామర్శించారు. కాగా, ఫిబ్రవరి 24న శ్రీదేవి మరణ వార్త విన్న అనంతరం అనుష్క ట్విట్టర్ లో ‘షాక్‌ లో ఉన్నాను, మాటలు రావడం లేదు. ఆమె కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు సానుభూతి తెలుపుతున్నాను. శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’ అంటూ పేర్కొన్న సంగతి తెలిసిందే. 
Virat Kohli
aunshka sharma
bony kapoor

More Telugu News